ఒంటరి బాటసారి

 నిన్నకాదన్నది నేడు చెంత చేరె

నేడు నాదన్నది రేపు నన్ను వీడె

ఏది ఎన్నాళ్ళో అది నా కెన్నాళ్ళో

ఏది కావలెనో  ఎంత కావలెనో

తెలియని తికమక లోకం లో

అలుపెరుగని ఆనందం కై

తిరుగులాడే ఓ ఒంటరి బాటసారి నేను.

ఈ నిర్జల భూమి లో ....

ఏ ఎండమావి తీర్చు ఎడతెగని నా దాహం?

ఈ జీవనోపాయంలో ఎప్పటికి నెరవేరెనో

ఈ నా భాగీరధ ప్రయత్నం?

తిరిగి తిరిగి మనస్సు ప్రపంచాన్నే చూస్తోంది. ఆనందం కోసం.

ఎంత చెప్పినా వినదు అది నాలోనే ఉందంటే... దాని కదో ఆనందం.

నిన్న ఇష్టమైనా, నేడు అయిష్టమైన

భావన నాదే కాని పరులది కాదుగా !

కల కలయంటే మెలకువ కల కాదా?

ఒక్క రెప్ప పాటులో సమస్త ప్రపంచం

నా కనుసన్నల్లోనే కదులుతోంది.

కళ్ళు తెరిస్తే బయట ప్రపంచం

కళ్ళు మూస్తే నాలో ప్రపంచం. ఎంత విచిత్రం.

మరి నేను “నేను” ఐతే .. అంతా శాశ్వత ఆనందం.. శంకరం.. శివోహం.

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...