తెలుగు తల్లి! మమ్ము కలుపు మమ్మ!


వక్రమయ్యె సోన్య వాడిన పాచిక

రగిలి పోయె ఆంధ్ర రాష్ట్ర మంత;

ఉద్యమాల బాట ఉరకెత్తె తెలుగోడు  

తెలుగు తల్లి! మమ్ము కలుపు మమ్మ!

 

వెర్రి ముదిరి పోయె వేరు పడుట లోన

జగము కాంచె వీరి జగడ మంత

కదలి వచ్చె ఢిల్లి; కరములు విడదీసె;

తెలుగు తల్లి! మమ్ము కలుపు మమ్మ!

 

పోరు వృద్ది చెందె పోలీసు పెట్రేగె

తెలుగు వాని మైత్రి తేలిపోయె

తెలివి లేని వాడు తెలుగువాడని పించె

తెలుగు తల్లి! మమ్ము కలుపు మమ్మ!

 

ధర్మ మెరుగ కుండె దాయాదులగొడవ

మందగించె బుద్ది మంది కెల్ల

అన్నదమ్ములెల్ల తన్నులాడుకొనిరి

తెలుగు తల్లి! మమ్ము కలుపు మమ్మ!

 

అర్ధరాత్రి వచ్చె అరకొర ప్రకటన

రక్త సిక్త మయ్యె రాజధాని

దొంగ దీక్ష తోటి దొరలైరి లీడర్లు

తెలుగు తల్లి! మమ్ము కలుపు మమ్మ!

 

 

 

 

 

  

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...