పరమాత్మ ఎవరు?
అసలు ఉన్నదే
పరమాత్మ. దాని కన్యము ఏదియూ లేదు. ఈ ప్రపంచమ౦తయూ వ్యాపించి వ్యక్త + అవ్యక్త
స్వరూపముగా వున్నవాడు, నీలోను నాలోనూ
పరమాణువు మొదలుకొని సృష్టి యంతయూ వ్యాపించి వున్న ఒకే ఒక్కడు పరమాత్మ.
నేను పరమాత్మ
ను చూడగలనా?
వ్యక్త
రూపములో వున్న సమస్త ప్రపంచము పరమాత్మనే. నువ్వు రోజు చూసేది, వినేది, మాట్లాడేది,
రుచి చూసేది, తాకేది, అనుభవించేది, ప్రేమించేది చివరకు చీదరించుకొనేది సమస్తము ఆయనే. ఆయన చేతనే ఇంద్రియములు చైతన్యము
పొంది ప్రపంచములోని విషయములను గ్రహించు చున్న కాని ఆయన అవ్యక్త స్వరూపమును ఇంద్రియముల
ద్వారా గుర్తించలేవు.
అవ్యక్త
స్వరూపమును చూచుట ఎట్లు?
ధ్యానము యందు
ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి అనుభవ పూర్వకముగా ఎవరికి వారు సాధన చేసి తెలుసు
కొనవలెను. ఇంద్రియములు, మనస్సు పరమాత్మ యొక్క వ్యక్త రూపమును అనగా ఈ ప్రపంచమును
తెలుసు కొనగలవు. అవి పూర్తిగా నిగ్రహించి చేయు ధ్యానమందు సచ్చిదానంద స్వరూపమైన ఆయన
అవ్యక్త స్వరూపం అనుభవమునకు వచ్చును.
అవ్యక్త
స్వరూప అనుభవము వలన లాభమేమి?
మోక్షము.
మోక్షము అనగా
నేమి?
సమస్తము
పరమాత్మే అనే జ్ఞానముతో, అన్ని బంధముల నుండి శాశ్వత విముక్తి పొంది, కర్మ
ఫలితములన్ని నశించిన సచ్చిదానంద స్వరూప స్థితి మోక్షము.
బంధం అనగా
నేమి?
మన సుఖదు:ఖములకు
కారణము ఏదయిననూ బంధమే.
జగత్ మిధ్య
అనగా నేమి?
సత్యము అనగా
ఎప్పుడూ ఉన్నది. మిధ్య అనగా నిజముగా లేకున్న వున్నది అన్న భ్రాంతి. వ్యక్త రూపములో
వున్న సమస్త ప్రపంచము ప్రపంచముగా సత్యము కాదు, అసత్యము కాదు, స్వతహాగా లేనిది
ఉన్నట్లుగా గోచరించే మిధ్య. ఉన్న పదార్ధము ఒక్క ఆత్మ మాత్రమే. ఆత్మ నుంచి వచ్చిన
ఈప్రపంచం ప్రపంచముగా సత్యముకాదు ఆత్మగా సత్యము. ప్రపంచము గా అది మిధ్యయే.
బంగారు నగలో
బంగారమే సత్యము. నగ సత్యము కాదు, అసత్యము కాదు అది స్వతహాగా లేని నగ వున్నట్టుగా
గోచరిస్తున్న బంగారమే. అదే మిధ్య.
మాయ
అనగానేమి?
ఉన్న సత్య
వస్తువును తెలియనీయక, ఉన్న ఒక దానినే అనేక విధములుగా వ్యక్త పరచి, ఒక దానికొకటి వేరు
వేరు అను భావము కలిగించుట.
నాకు మరణము
లేదు. జననము లేదు. కోపము ద్వేషము అసూయ వంటివి లేవు. ప్రేమాభిమానములు కూడా లేవు. రాగద్వేషాలకు
అతీతుడనయిన పరమాత్మను నేను. అందరిలోన వున్నది నేనే. నేనే నీవు. నీవే నేను. అదియే
సత్యము. మన ఇద్దరికీ భేదము లేనే లేదు. ఏది అనంత ఆనంద చైతన్య సాగరమో అదియే నేను అదియే
నువ్వు. నేనే ఈశ్వరుడను. నేనే ప్రపంచమును. నేనే జీవుడను. నేను ఏకమే, నేనుకాని
రెండవది ఏదియూ లేదు. నేను సత్య స్వరూపుడను, ఈ సమస్త ప్రపంచము నాయందె కలదు, దానికి
బీజము నేనే. ఈ జగత్తు అంతయూ అనగా నీతో కూడా కలుపుకొని సమస్తము నాచే అనగా ఆత్మచే
పూర్ణమై ఉన్నది. అనగా ఉన్నది ఒక్కటే అదియే నువ్వు, అదియే నేను అదియే ప్రపంచము. ఇది
సత్యము.
మరి ఆనంద
స్వరూపుడనైన పరమాత్మ అనగా నేను ఈ బంధమును ఎందుకు కలిగివున్నాను? ఎందుకు దు:ఖములను
అనుభవిస్తున్నాను?
మరి పరమాత్మను
పొందుట ఎలా? దానికి సాధనలేమి? అనంత చైతన్యమును పొందే అవకాశము ఉందా? అని అంటావేమో
లేని దానిని సాధన చేసి పొందవచ్చు కాని అసలు నీవై వుండి నీలోనే ఉన్నదానిని
క్రొత్తగా పొందేదేమిటి? అసలు ఉన్నది నువ్వే నాకంటే నువ్వు గాని ఈ ప్రపంచము గాని
ఎన్నటికి వేరు కాదు.
No comments:
Post a Comment