తెలుగుబిడ్డా! లేవరా!
జాతిఋణమును
తీర్చరా!
శాంతిమార్గము
వీడరా!
పోరుబాటను
పట్టరా! |తె|
ఆంధ్రజాతికి మోసమా?
ఉప్పెనల్లె
లేవరా!
బాలచంద్రుడి
పౌరుషాగ్నిని
పార్లమెంటుకు
చూపరా! |తె|
“దేహి దేహి” అనకురా!
“హక్కునా”దని చాటరా!
ఢిల్లి పీఠము
దద్దరిల్లగ
సింహనాదము
చేయరా! |తె|
మాయమాటలు
వినకురా!
మర్మమన్నది
గాంచరా!
దేశమేలే
పాలకులకు
గుండెధైర్యం
చూపరా! |తె|
No comments:
Post a Comment