స్నేహితులు

 

BSR:

కలశ గంగ నెత్తి కార్తీక మాసాన

కన్న బిడ్డ వొచ్చె కాంచుమయ్య !

బిందె చిన్న దనుచు బీరాలు పోబోకు

శ్రీనివాసునింట శ్రీలు నింపు.

 

Chandu:

 

శివుని మానసాన శిఖరమ్ము పై నిల్పి  

భక్తి బాట పట్టె ముక్తి కొరకు

ధర్మ కార్య మంటె తనువెల్ల తపియించు

చంద్రనామ ధేయ జయము నీకు

 

కపట బుద్ది లేని కల్మషం బెరుగని

స్వచ్చ మైన ప్రేమ చందు తెచ్చె

నమక చమక మనెడి నామమ్ము జపియించు

శరణు నొసగుమయ్య శంకరయ్య !

 

Viswanath:

పొద్దుటేల మనము పుట్టిన దినమున

శుభము నీకు యనుచు స్పూర్తి నింపు;

సకల శుభములన్ని శంకరునాజ్ఞతో

విశ్వనాథు నింట వెలయు గాక !

 

Bhamidipati:

చదువు లందు మేటి చదువులు చదివేను

వయసు నలుబదైన వగవ కుండ

సాయి మదిన నిల్పి సాధించు నేదైన

భక్తి యందు మిన్న భమిడి పాటి

 

Koushik:

కౌశిక్ బొమ్మా వేసిన బొమ్మలు చూసి ముచ్చటేసి ఆశీస్సులతో వ్రాసిన కంద పద్యం.

 

"కౌశీ బొమ్మా" బొమ్మలు

కాశీనాథుని కరుణను కాంచన మయ్యెన్;

ఆశయ సిద్దిని గూర్పుడు

కేశవ! శారద! గణేశ! కీర్తుల తోడన్.


No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...