హృదయము ఛిద్ర మయ్యె ...
కను సన్నుల మాటున జారె
నొక బిందువై...
బిందువు బిందువు లకూడి చెక్కిళ్ళ నడుమ పారె ధారయై ...
వాగులు, వంకలు నదులుగ నా తల్లి గర్భమ్బు చేరె నొక సముద్రమై ...
ఈ నా దేశపు వృద్దుల దీన స్థితులను గాంచి
నంతనే ...
కనిపించని ఈ
శోక సముద్రములో విల విల లాడిన వృద్దులెందరో ...
అక్కరకు రాని కొడుకు కోడళ్ళు ...
చుట్టపు చూపుకు కరువైన కూతుళ్ళు ...
పలుకరించ సమయమే లేని బంధు జనులు...
చేవ చచ్చి వృ ద్దులైన తోటి మిత్రులు...
వయసుతో వచ్చేటి జబ్బులు ...
మింగలేని మందులు...
డబ్బు లెక్కింపులో గోడు మరచిన డాక్టర్లు...
ఏ జన్మలో చేసిన పాప ఫలమ్మో కన్న బిడ్డలై పుట్టె నీ జన్మలో...
స్వార్ధమే తప్ప బాగోగు లెరుగని బిడ్డ
పుట్టనేమి ...
తల్లీ!! క్షమించు నీ బిడ్డ చచ్చె గర్భంబు నందే ...
క్షమించమనటానికి
ఖర్చు .... వెలలేని కన్నీరే ...
కన్నీటికి విలువుంటే బొట్టైన రాలదులే....
No comments:
Post a Comment