అంతర్మథనం



శివా! సర్వ మన్నది శివము అయితే

నేను అన్నది ఎవ్వరో ?

ఉన్నదంతా నీవె అయితే

చావు పుట్టుక లెవరికో?

ఏక మైనది  నీవె అయితే

                   అనేకమైనది ఎవ్వరో?

జ్ఞానమే నీ స్వరూపమైతే

అజ్ఞాన మన్నది ఎవరికో ?

          అణువు అణువున నీవె వుంటే   

          వెదకులాటలు ఎందుకో?

మార్పు అన్నది లేని నీలో

                   మారు జగములు ఏలనో?

రూప మన్నదె  లేని వానికి     

          విశ్వరూపము ఎటులనో?

స్వచ్ఛ మన్నది నీవె అయితే                                

          మాయ ఎక్కడ పుట్టెనో?

తలపులన్నవి లేవె నీకు   

ఇక.. సృష్టి తలచిన దెవ్వరో?

సాక్షిభూతుడు నీవు కాగా?

మరి.. జగములేలే దెవ్వరో?

 

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...