గుండె ఘోష
బడుగుజీవి బ్రతుకునందు
ఆశలన్ని అణగారెను
చూపేమో సన్నగిల్లె
తాపమేమో పెచ్చరిల్లె
కన్న కలలు కల్లలాయె
కన్నీరే కరువాయె
నీటి చుక్క జారదాయె
ప్రభువు మనసు మారదాయె
కండలన్ని కరిగిపోయె
గుండెంతా మరిగిపోయె
శరీరమే శల్యమయ్యె
జీవితమే శిధిలమయ్యె
చీకటయ్యె బ్రతుకంతా
చెదిరిపోయె మనసంతా
ధైర్యమంత కోల్పోయే
దైన్యముతో కూలబడియె
వరి పైరులు కాలరాచి
రాజ్యమేలు దరిద్రమందు
అన్నదాత అనుక్షణం
అనుభవించె నరకమిచటె
కారుణ్యపు
రాశినీవు
కనికరింప రావేలా?
పరితపించు ఎదలలోన
పన్నీటిని నింపవేల?
No comments:
Post a Comment