ఆటలాడువేళ ఆటగాళ్ళ కొరకు
బల్లి రావె యనుచు బ్రతిమలాడు;
బడికి వెల్ల ననుచు పడిదొర్లు సమయాన
భుజము కెత్తు కొనుచు బుజ్జ గించు;
చదువ నన్న నాకు చదువునేర్పేనంట
నేల పలక మీద నేర్పు తోడ;
చాకు పీసు తోడ చక్కగా వ్రాయించి
అక్షరాలు నేర్పె ఆది గురుడు.
అంకితము జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా ( 02.06.1967 – 02.06.2017) ...
No comments:
Post a Comment