సమస్యా పూరణం.
సమస్య : బారనంగ మురిసె బాపనయ్య
నా పూరణ:
అంబరమునుతాకు నధిక ధరలతోడ
అలసి సొలసి పోయె అయ్య వారు;
"సంతలోన దొరకు సరుకెంతయో చౌక
బా" రనంగ మురిసె బాపనయ్య
సమస్య : సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్
(శ్రీరాముని అశ్వమేధయాగ
సందర్భం)
భువిలో రాజ్యము
బెంచగ
భవభయ హరుడౌ
రఘుపతి బంగరు సీతన్
నవహయ మేధమున
నిలుప
సవతినిఁ గని
సీత మిగుల సంతస మందెన్
సమస్య : దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే!
నా పూరణ:
నిర్భయమగు
ముక్తి కొరకు
దుర్భరమగు తపము
సల్పు ధూర్తుని నైనన్
నిర్భరమగు
ప్రీతి విరియ
దౌర్భాగ్యము
నిచ్చి ప్రోచు దామోదరుఁడే!
సమస్య: శారదయే
బలిగొనెఁ గద జను లెందరినో!
నా పూరణ:
భారము బాపన బ్రతుకులు;
నేరక వేదము
చదివిరి; నేటి దినమునన్
వరునకు వధువది
దొరకదు
శారదయే
బలిగొనెఁ గద జను లెందరినో!
నది - మది - పది - గది
పై పదాలను
ఉపయోగిస్తూ గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
పదిలమైనవిద్య
పదుగురి మేలుకై
గురుకులాన
గదిని గురువు తెల్పు;
నదియు తెలిసి
కొనుచు నానా విధమ్ముల
మంచి
శిష్యుడెపుడు మదిన నిల్పు
సమస్య: "కోడిమాంసమ్ము హితము యోగులకుఁ
దినఁగ"
నా పూరణ:
దేశ రక్షణ
సల్పెడి ధీరులకును
కోడిమాంసమ్ము
హితము; యోగులకు దినగ
కాయ గూరలు
పండ్లును కంటె నధిక
హితము గూర్చెడి
ఆహార మెందు గలదు?
సమస్య: సర్వజ్ఞుండైనవాఁడు
చంద్రుఁడె సుమ్మీ
నా పూరణ:
(చంద్రబాబుని మనసులో
పెట్టుకుని)
సర్వుల హితమును
గోరుచు
సర్వసమర్ధుడు
పవిత్ర సంగమమునకై
ఉర్విన నదులను
కలిపెను
సర్వజ్ఞుండైనవాఁడు
చంద్రుఁడె సుమ్మీ
సమస్య: ఖరపథంబు
సౌఖ్యకారకంబు
నా పూరణ:
ఓర్పు గూర్చి
మనకు నేర్పులే పాఠంబు
ఎంత బరువు నైన
ఇట్టె మోయు
"గాడిదన్న"
తిట్టుకాదు పొగడ్తరా!
ఖరపథంబు సౌఖ్యకారకంబు
సమస్య: ధారణ
లేని కవియె యవధానిగ నెగడున్
నా పూరణ:
ధారాళముగా
పద్యము
ధారణ చేసిన
కవులను ధాత్రిని మరువన్;
పూరణ, ప్రేరణ, వర్ణన
ధారణ లేని
కవియె యవధానిగ నెగడున్
సమస్య: సతతము
వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్
నా పూరణ:
మితముగ మాటలు
బలుకుచు
రతనము బోలెడి
నడతల రమణీయముగా
పతనము చెందక
నడువుము
సతతము వినుమ!
స్తవనీయ సత్కథ లెల్లన్.
దేశము - కోశము
- పాశము - నాశము
పై పదాలను
ఉపయోగిస్తూ దేశభక్తిని ప్రబోధిస్తూ
నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
నా పూరణ:
దేశము నాదని
తలుపక
నాశము కోరెడి
జనుండు నావాడై నన్
కోశము నందలి
కత్తియె
పాశము
త్రెంపును మరువకు భారత యువతా.
సమస్య: దుర్మార్గము
గాదు గురుల దూషించినచో
నా పూరణ:
ధర్మము పేరిట
మోసపు
కర్మలు జేయుచు
మతమును గప్పుకు బ్రతికే
దుర్మత బాబా
లెందరొ ?
దుర్మార్గము
గాదు గురుల దూషించినచో
సమస్య:
మీసములన్ గనంగగలమే యిక మేదిని నెందుగాంచినన్
నా పూరణ:
(ఆంధ్ర రాష్ట్రానికి
కాంగ్రెసు బీజెపి చేసిన అన్యాయం చెబుతూ)
చేసిరి
తప్పిదమ్మొకటి చీకటి మాటున జీల్చి రాష్ట్రమున్;
మోసము జేసిరిర్వురును
ముచ్చట గొల్పెడి ఆంధ్రజాతికిన్;
వేసము నందునన్
కపట వియ్యము నందున ఆరితేరుచున్;
మీ సములన్
గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!
సమస్య: అన్ని పాదాల
వరుసగా "శి - వ - రా - త్రి" వచ్చేలా శివస్తుతి.
శివుడు సత్యము
సర్వము; శివుడె మాయ;
వదలు బంధాలు జన్మలు
వాని గొలువ;
రాయిలోనెగాదుచరాచ
రమున గలడు;
త్రిణయనునిగొల్వ
కష్టాలు తీరు నయ్య.
చలించేది
నీనయితే చలించని వాడెవ్వడు?
అంతా శివం
అయితే శవమైన వాడెవ్వడు?
No comments:
Post a Comment