ఎవరు ఏమి తెలుసుకోవాలి?

 

ఎవరు ఏమి తెలుసుకోవాలి?

నువ్వు భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ప్రపంచం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిన్ను నీవు తెలుసు కోవాలి. ఆ పై మోక్షము గురుంచి ప్రయత్నం చేయాలి. అదే మనిషి యొక్క జీవిత పరమావధి.

సరే. భగవంతుడు ఎవరు?

ఎప్పుడు ఉన్నది. అన్ని తెలిసిది. ఆనంద స్వరూపం. అంతా వ్యాపించి వున్నచైతన్యము. అదియే సమస్తము. అది తప్ప మరొకటి లేదు. అదియే ఆత్మ, పరమేశ్వరుడు మరియు భగవంతుడు అను వేరు వేరు నామాలతో పిలవ బడుతూ, వివిధ రూపాలతో కొలవబడుచున్నది. ఒక్క మాటలో అది సచ్చిదానంద స్వరూపం.

ప్రపంచము అంటే?

అనిత్యమైనది. నిత్యం మార్పుచెందునది. నామరూపాలతో వున్నది. కాలముతో కదులుతూ ప్రతి నిత్యము మనకు అనుభవములో నున్నది. మనతో కూడి మన చుట్టూ వున్న సమస్తము అదే. మనం నిత్యమూ చూసేది, వినేది, తెలుసుకునేది ఈ ప్రపంచములోని విషయాలనే.

నేను ఎవరు?

ఈ భౌతికి శరీరమే నేనుగా భావిస్తు,  మాయచే తన నిజ స్వరూపము మరచి, “అహం” స్పురణతో వున్నవాడు. అజ్ఞానము వలన అంతా వ్యాప్తి చెందిన ఆత్మ తనలోకూడా ఉన్నాడని తెలుసుకోలేక భగవంతుడు తనకంటే వేరు అని, మిన్న అని తలచెడి వాడు.

అజ్ఞానము అంటే ఏమిటి?

ఆత్మ స్వరూప జ్ఞానము లేక పోవుట.

మాయ అంటే?

ఉన్నదానిని తెలియనీయక, లేనిది వున్నట్టుగా, వున్నది లేనట్టుగా చూపునది.

మాయ భగవంతుడి కంటే భిన్నమయినదా?

కాదు, అది భగవంతుడి యొక్క శక్తి, ఆయనలోనిదే.

మాయ భగవంతుడి శక్తి. మాయ వలన అంతటా నున్నభగవంతుడు నేను వేరు అనుభావన కలుగుతున్నది. మరి అంతటా నున్నభగవంతుడిని ఆయన శక్తియైన మాయ ఆవరించి ఎందుకు భగవంతుని స్వరూపం ను కప్పి “నేను” అను భావన కలిగిస్తోంది? భగవంతుని శక్తి భగవంతునికే “అహం” స్పురణ కలిగించటమేమిటి?

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...