ఇది మన దేశ
చరిత్రలో దుర్దినం.
ఈ రోజు ...
సూర్యుడస్త
మించని బ్రిటీష్
సామ్రాజ్యాన్ని
హడలెత్తించిన
ముసలి తాత
నవ్వాగిన రోజు
నలుబది కోట్ల
జనుల నొక్కటి జేసి
ఒకే నినాదం
పలికించిన
అహింసా జ్యొతి
ఆరిన రోజు
భరత మాత ముద్దు
బిడ్డ
భారత జాతి పిత
జాత్యహం
కారాలకు
నేల కొరిగిన
రోజు
హిందువు లోన
ముస్లిం లోన ఉన్నది ఒకే రక్తమని
చాటిన బాపూ
ఛాతి ని చీల్చిన రోజు
No comments:
Post a Comment