అంకితము
జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా
(02.06.1967 – 02.06.2017)
తల్లి: జంధ్యాల సుభాషిణ
తండ్రి: డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
అంజలి
తల్లి తలపు నాకు తత్వబోధ తెలిపె;
గుండె లోతు లందు గుబులు తీర్చె;
చింతలన్ని వీడి చిన్మూర్తిగా నున్న
అమ్మ ప్రేమ ఎపుడు మమ్ము కాచు.
తెలుగు భాష లోని తియ్యందనము తెల్పి;
తప్పు లన్ని మార్చి ఒప్పు చేసి;
తండ్రి గురువు అయిన తనయుడి భాగ్యంబు
శతక రచన యందు సంభవించె.
అన్ని జంట లందు ఆదర్శ మీజంట
అనుచు మెచ్చి రంట అవనిసురులు;
ఆత్మవేద రచన అంకితమ్ముగ నిత్తు
ధన్య మయ్యె బ్రతుకు తమరి చెంత.